అనంతపురంలో విషాదం 13 మంది దుర్మరణం….

Boat sinking

Ananthapuram boat

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎర్రతిమ్మరాజు వైటీ చెరువు లో ఘోరం చోటుచేసుకుంది. బోటు బోల్తా పడి 13 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కాగా ఓ చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించి – చికిత్స అందిస్తున్నారు. మిగతా ముగ్గురి కోసం ఈతగాళ్లు గాలిస్తున్నారు. కాగా బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం బాధాకరం.

కాగా  పడవ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – ఏపీ ప్రతిపక్ష నేత – వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సంఘటనపై స్పందించి సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో  వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటన స్థలంలోనే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడే తెలియజేయాలని ఎస్పీని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం  మృతుల కుటుంబానికి 5 లక్షల పరిహరం ప్రకటించారు

Leave a Reply