నోరు జారిన స్టార్ హీరోయిన్

 

తన ప్రసంగాన్ని రక్తి కట్టించే ప్రయత్నంలో.. తాను తీసిన సినిమా గురించి గొప్పలు పోయే క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నోరు జారింది. సిక్కిం రాష్ట్రం గురించి ఆమె తక్కువ చేసి మాట్లాడటం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆ రాష్ట్ర ప్రజలు కంగన మీద మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

 

సిక్కిం నుంచి వలస వెళుతున్న క్రమంలో ఇద్దరు చిన్నారుల జీవితాల నేపథ్యంలో ప్రియాంక ‘పహూనా’ అనే సినిమాను నిర్మించింది. ఈ చిత్రాన్ని టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఇది గొప్ప సినిమా అని.. మంచి కథను చాలా హృద్యంగా చెప్పారని ప్రశంసించారందరూ. ప్రియాంకను అందరూ అభినందించారు.

ఐతే సినిమా ప్రదర్శన పూర్తయిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడిన ప్రియాంక.. ‘‘సిక్కిం రాష్ట్రంలో అల్లర్లు ఎక్కువ. అల్లకల్లోలంగా ఉంటుంది. మేం ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. సిక్కింలో సినిమాలు నిర్మించే వసతి లేదు. అసలిక్కడ ఫిల్మ్‌ ఇండస్ట్రీయే లేదు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన తొలి సినిమా మాదే కావడం హ్యాపీగా ఉంది’’ అని వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యల మీదే సిక్కింలో దుమారం రేగింది. చాలా ప్రశాంతంగా ఉండే తమ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడతావా.. అంతర్జాతీయ వేదికపై మా రాష్ట్రాన్ని కించ పరిచేలా మాట్లాడతావా.. మా టూరిజంను దెబ్బ తీస్తావా అంటూ సిక్కిం వాసులు ప్రియాంకను తిట్టిపోస్తున్నారు. ఇక్కడి నుంచి సినిమాలే రాలేదన్న మాటలు కూడా అబద్ధమని అంటున్నారు.

సోషల్ మీడియాలో సిక్కిం జనాలు ఆమెను టార్గెట్ చేసుకున్నారు. అక్కడి నాయకులు ఆమెను బహిరంగంగానే తప్పుబడుతున్నారు. టూరిజం మినిస్టర్ కూడా ప్రియాంకను విమర్శించాడు. దీనిపై క్షమాపణ చెబుతూ ప్రియాంక ప్రకటన చేయక తప్పని పరిస్థితి నెలకొంది.

Leave a Reply