బాబుకు జగన్ మీడియా సూటి ప్రశ్న: టీడీపీ వెబ్‌సైట్‌లో ఆ పోస్టుల సంగతేంటి!

విజయవాడ: ఇన్నాళ్లు మీడియాను మేనేజ్ చేస్తే చాలనుకునే పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియాపై సైతం విపరీతంగా ఫోకస్ చేస్తున్నాయి. అనుకూల మీడియాల్లో వారి భజనలు తారాస్థాయికి చేరుతుంటే.. సోషల్ మీడియా మాత్రం ఆయా పార్టీల, ప్రభుత్వాల డొక్క చించి డోలు కడుతోంది. సోషల్ మీడియా దుర్వినియోగం చేస్తున్నారు, అలా రాయొచ్చా:బాబు దీంతో సోషల్ మీడియాలోను ఆయా పార్టీలు రహస్య ఏజెంట్లను నియమించుకున్నాయి. ఎవరు తమకు అనుకూలం? ఎవరు ప్రతికూలం? అన్న అంశాలపై ఫోకస్ చేస్తూ.. వ్యతిరేక ప్రచారానికి పాల్పడినవారిని టార్గెట్ చేసే పనిని ముందేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ పంచ్ అనే వెబ్ సైట్ లో కార్టూనిస్టుగా చేస్తున్న రవికిరణ్ అరెస్టు జరిగింది.

Leave a Reply