ముందస్తు ఎన్నికలకు జన‘సేన’ సిద్ధమే

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వస్తే తమ పార్టీ సిద్ధంగా ఉంటుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘ఎన్నికల యుద్ధం ఒకవేళ ముందస్తుగా వస్తే జన‘సేన’ సిద్ధమే’ అని శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు.

కేంద్రం నుంచి ముందస్తు ఎన్నికల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో తెదేపా కూడా ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు నిన్న పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 2018 చివర్లో ఎన్నికలు వచ్చేటట్లయితే ఇక ఏడాదిన్నర సమయం మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పవన్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు.

Leave a Reply