రవితేజ కోసం ఫ్రీగా చేసేసింది

 

రవితేజకి ఇండస్ట్రీలో వున్న క్లోజ్‌ ఫ్రెండ్స్‌లో ఒకరు రాశి ఖన్నా. తనతో పని చేసిన హీరోలు, దర్శకులు అందరితో ఫ్రెండ్లీ రిలేషన్‌ మెయింటైన్‌ చేసే రాశి ఖన్నా, వీకెండ్స్‌లో ఖాళీగా వున్నపుడు పార్టీలు ఇస్తూ వుంటుంది. రాశి ఖన్నా పార్టీ అనేసరికి మిస్‌ కాకుండా అందరూ ఆమె ఇంట్లో వాలిపోతుంటారు.

రవితేజతో రెండు సినిమాలు చేసిన రాశికి అతనంటే ప్రత్యేక అభిమానం. రవితేజ కూడా మిగతా వారితో కంటే రాశితో చనువుగా వుంటుంటాడు. తమ స్నేహ సంబంధాలని మరింత పటిష్టం చేసుకుంటూ రవితేజ కోసం ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో ఒక స్పెషల్‌ సాంగ్‌ని రాశి ఫ్రీగా చేసేసింది.

దిల్‌ రాజు, అనిల్‌ రావిపూడితో కూడా ‘సుప్రీమ్‌’ వల్ల మంచి రిలేషన్‌ వుండడంతో ఈ పాట చేయడానికి రాశి పారితోషికం తీసుకోననేసింది. దిల్‌ రాజు బ్యానర్‌ కనుక ఎంత కాదన్నా రాశికి ఈ పాటకి కనీసం ఇరవై లక్షలయినా వచ్చి వుండేవి.

కానీ స్నేహితుల కోసం పాటని ఫ్రీగా చేసి పెట్టి స్నేహానికి తాను ఎంత వేల్యూ ఇస్తాననేది రాశి చాటుకుంది. రాజా ది గ్రేట్‌ దీపావళికి ముందు థియేటర్లలోకి రానుంది. రవితేజ అంధుడి పాత్ర చేస్తోన్న ఈ చిత్రం కమర్షియల్‌ చిత్రాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తుందని అంటున్నారు.

Leave a Reply